
లింగాలఘణపురం, మన చౌరాస్తా : లింగాలఘణపురం మండలం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా చిటుకుల అశోక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కొత్తకొండ ప్రణయ్ చరణ్, కోశాధికారిగా బాల నరసయ్య, గౌరవ అధ్యక్షుడిగా మంగ చంద్రయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీకి జిల్లా కెమిస్ట్రీ & డ్రాగెస్ట్ అధ్యక్షులు మెరుగు దేవరాజు, కార్యదర్శి యాంసని కృష్ణ, కోశాధికారి దోర్నాల వెంకన్న నియామక పత్రాలు అందజేశారు.