
హైదరాబాద్, మన చౌరాస్తా : హైదరాబాద్ మణికొండలోని శ్రీ గాయత్రి ఈ టెక్నో స్కూల్లో ‘క్రియేటివ్ స్పార్క్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో చురుకుదనం, సృజనాత్మకతను పెంచడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రియేటివ్ స్పార్క్స్ లో భాగంగా పలువురు విద్యార్థులు మెహెందీ, బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్, పోస్టర్ మేకింగ్, ఫ్లేమ్ లెస్ కుక్కింగ్, హెల్దీ డ్రింక్స్ వంటివి ప్రదర్శించడంలో చిన్నారులు ఉత్సాహం చూపించారు.
ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ జనరేషన్లో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను ఎంచుకోవడం, హెల్దీ ఫుడ్స్ మాత్రమే తినాలన్న అలవాట్లను నేర్పించడం.. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పట్ల అవగాహన పెంచడానికి తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులనే భాగస్వామ్యం చేశామని శ్రీగాయత్రి స్కూల్ యాజమాన్యం తెలిపింది.
తమ పాఠశాల విద్యార్థులు చదువులోనే కాకుండా.. అన్ని రంగాలలోను ముందుండేలా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన తల్లిదండ్రులు చిన్నారుల ఆసక్తి, ఉత్సాహానికి మురిసిపోయారు. కనులవిందుగా జరిగిన ఈ క్రియేటివ్ స్పార్క్స్ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మధుసూదన్, సీఈఓ సర్వేశ్వర రావు, ప్రధానోపాధ్యాయురాలు రచన పటేల్ తదితరులు పాల్గొన్నారు.