
- ఇది ఆయన తెచ్చిన కరువే..!
- పాలన చేతకాక ప్రకృతి, ప్రతిపక్షాలపై నిందలు
- రాష్ట్రంలో కమీషన్ల పాలన
- ఏ బిల్లులు 20 శాతం కమీషనేట..
- కాంగ్రెస్ వైఫల్యం వల్లే వరంగల్ కరువు
- జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయ్..
- రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపాటు
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : ‘రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గ్రహనం.. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాడిన కరువు కాలం తెచ్చింది కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.. పాలన చేతకాక దానిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం కాలం.. ప్రతిపక్షాలపై లేనిపోని నిందలు వేస్తుండు..’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కారుపై విరుచుకు పడ్డారు.
‘ మొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎండల వల్ల పంటలు ఎండిపోతుంటే కేసీఆర్ , హరీశ్‌రావు సంతోషపడుతున్నారని అన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎండలు కొట్టాయి. కానీ ఆనాడు ఎందుకు పంటలు ఎండలేదు. ఈరోజు ఎందుకు ఎండిపోతున్నాయి? మండుటెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువుల్లో నీళ్లు ఉండేవి. కేసీఆర్ పాలనలో ఒక ఎకరం కూడా ఎండలేదు. రేవంత్‌రెడ్డి పాలన చేతకాక ప్రకృతి, ప్రతిపక్షాలపైన నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికి రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు..’ అని మండిపడ్డారు.
మేం ఏమైనా అడ్డు పడ్డామా..!
‘ దేవాదుల ఓ అండ్ ఎం కాంట్రాక్టర్ కు రూ.7000 కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులు పంపుల మోటర్లు ఆన్ చేయలేదు. 33 రోజులు దేవాదుల పంపుల మోటార్లు ఆన్ చేసి ఉంటే రిజర్వాయర్లు నిండేవి, పొలాలకు నీళ్లు వచ్చేవి.. రేవంత్ రెడ్డి చేసిన తప్పును ప్రకృతి మీద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు ఇవ్వద్దని మోటార్లకు అడ్డంగా హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు నిలుచున్నారా?’ ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డిది ట్వంటీ.. ట్వంటీ పాలన…
సీఎం రేవంత్ రెడ్డి ది ట్వంటీ.. ట్వంటీ మ్యాచ్ అని చెప్పుకుడన్నాడు.. నిజంగా ఆయనది ట్వంటీ.. ట్వంటీ పాలనే అని హరీశ్‌రావు ఎద్దేవ చేశారు. ‘ఫైనాన్స్ లో ఏ బిల్లు ఇవ్వాలంటే 20 శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనట.. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20 పర్సంటేజీ, మున్సిపల్ డిపార్ట్ మెంట్లో అపార్ట్మెంట్ లకు, గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ ఇవ్వాలన్న 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనట..’ అని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లనే వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని హరీశ్ అన్నారు.
మేం ఒడిసిపట్టినం.. వాళ్లు వదిలిపెట్టిడ్రు…
ఈసారి ప్రకృతి కనికరించింది. పోయిన సారి కంటే ఈసారి వర్షాలు సమృద్ధిగా పడ్డాయని హరీశ్‌రావు అన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే వేలాది టీఎంసీల నీళ్లు గోదావరిలో కలిశాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు చుక్క చుక్కను ఓడిసిపడితే.. రేవంత్ రెడ్డి ఏమో నీళ్లును వృథాగా వదిలిపెట్టి ఇప్పుడు ప్రకృతిపై నిందలు వేయడం సరికాదన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేసి ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సెక్రటరీ చుట్టూ తిరిగి వెంటపడి 30 రోజులకి ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయించుకొని మోటర్లు రిపేర్ చేపించారు. 33 రోజులు మోటర్లు బాగు చేసి ఉంటే ఈ నీళ్ల కరువు వచ్చేది కాదన్నారు. ఇప్పుడు మోటార్ ఆన్ చేసిన నీళ్లు అందని పరిస్థితి ఉందన్నారు. ఒక వరంగల్ జిల్లాలోని లక్ష ఎకరాలు ఎండిపోతున్నాయి అంటే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి చేతకానితనం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని మండిపడ్డారు.
బాబుకు గురుదక్షిణ…
‘కృష్ణా నదిలో రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. బాబు కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు.’ అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఇక ఇరిగేషన్ మంత్రి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మౌనంగా ఎందుకు ఉండున్నాడని ప్రశ్నించారు. ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా చంద్రబాబు దగ్గరికి వెళ్లి భోజనం చేసి వచ్చాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఈ కారణంగా ఈ రోజు నల్గొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కూడా పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ కళ్లు తెరిచి దేవాదుల ఫేజ్ 3 మోటార్ ఆన్ చేసి నీటి కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. అలాగే నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.20 వేల పరిహారి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో జనగామ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి , మాపీ ఎంపీపీ కలింగ రాజు, మాజీ కౌన్సిలర్లు బండ పద్మా యాదగిరిరెడ్డి, పేర్నీ స్వరూప, అనిత, ముస్త్యాల దయాకర్, ఎండీ సమద్, బీఆర్ఎస్ పట్టణ తాళ్ల సురేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సింహులు, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, నాయకులు పానుగంటి ప్రవీణ్, మసీ హుర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.