
- తల్లిదండ్రుల చెంతకు శివాని
- చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
- 13 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
- అభినందించిన ఏసీపీ పండరి చేతన్ నితిన్
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : ‘అమ్మ’య్యా.. జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన 10 నెలల పసిపాప శివాని కథ సుఖాంతమైంది. జనగామ పోలీసులు తమదైన శైలిలో కేసును ఛేదించి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం నిడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్ మంగళవారం జనగామ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు.
చత్తీసగఢ్ రాష్ట్రానికి చెందిన చెందిన పార్వతి, రామ్జుల్ రాజాక్ దంపతులు కొన్ని రోజుల కింద బతుకు దెరువు కోసం జనగామకు వలస వచ్చారు. పట్టణంలో కూలి పని చేసి జీవనం సాగిస్తున్నా వీరికి నలుగురు సంతానం. అయితే 13 రోజుల కింద రామ్ జిల్ రాజాక్ చిన్న కూతురు శివాని (10 నెలల) కిడ్నాప్‌కు గురైంది. తమ పాపను తమతో పనిచేస్తున్న విజయలక్ష్మి, స్వామి రాజ్ కిడ్నాప్ చేశారని వారు ఆరోపించారు. ఈ మేర జనగామ పోలీసులకు ఫిర్యారు చేశారు.
శ్రమించిన పోలీసులు..
కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. అయితే కిడ్నాపర్లకు సంబంధించి పేరు మినహా ఎలాంటి ఆధారాలు లేవు. ఆ కూడా సరైందా కాదా అనే ప్రశ్నలు మరోవైపు.. కానీ పోలీసు తమదైన వ్యూహంతో ముందుకు సాగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందుతుల నడవడిని గుర్తించి పట్టుకున్నారు. విజయవాడకు చెందిన చంద్రమ్మ అనే మహిళతో కలిసి పిల్లలు లేని వారికి పాపను అమ్మాలనే ఆలోచనతో పంతంగి సురేశ్, పెండ్ర తిరుపతమ్మ, గరికముక్కు విజయలక్ష్మితో కలిసి పథకం ప్రకారం పాపను కిడ్నాప్ చేశారని గుర్తించారు. సోమవారం హైదరాబాద్ జాతీయ రహదారి పెంబర్తి వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా నిందితులు పోలీసులకు చిక్కారు. గతంలోనూ వీరిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఏసీపీ పండరి చేతన్ నితిన్ తెలిపారు. కిడ్నాప్ కేసును తక్కువ సమయంలో ఛేదించిన జనగామ సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై చెన్నకేశవ, కానిస్టేబుళ్లు కరుణాకర్, మహేందర్, అరవింద్, ఏఏవో సన్మాన్ను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.
పోలీసులకు ధన్యవాదాలు…
గత 13 రోజులుగా తమ పాప శివాని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పార్వతి, రామ్జుల్ రాజాక్ అల్లాడిపోయి కన్నీరుమున్నీరయ్యారు. మంగళవారం పోలీసులు పాపను వారికి అప్పగించడంతో ఆనందంలో మునిపోయారు. కిడ్నాప్ అయిన పాపను గుర్తించి అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.