
బచ్చన్నపేట, మన చౌరాస్తా : బచ్చన్నపేట మండలంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం రావడంతో రైతులు దుఖ సాగరంలో మునిగారు. మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని ఆలీంపురం గ్రామంలో ఐకేసీ సెంటర్ వద్ద పిడుగు పడి 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో వంగపల్లి రంగారెడ్డి, వంగపల్లి సుశాంత్ రెడ్డి, గంట పద్మ, భీమ్ రెడ్డి జనార్దన్ రెడ్డి, భీమ్ రెడ్డి భారతమ్మ, దండ్యాల మల్ రెడ్డి, గూడెం మంగమ్మ, పాకాల మల్లయ్య, పారుపల్లి నందిని ఉన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)