
బచ్చన్నపేట, మన చౌరాస్తా : జమ్ము కాశ్మీర్ పహిల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బచ్చన్నపేట మండల యువత ఆధ్వర్యంలో బచ్చన్నపేట ప్రధాన చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు కోవర్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం యువత మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన భారత పర్యాటకులపై దాడి చేసి చంపడం చాలా బాధాకరమని ఇప్పటికి యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని పాకిస్తాన్ కు దమ్ముంటే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని భారత్ తలచుకుంటే పాకిస్తానీయులు ఎవరు కూడా ప్రాణాలతో బ్రతకరని భారతీయుల దమ్మేంటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో ఇజ్జగిరి రాములు, జిల్లా సందీప్,పిన్న రమేష్, కొత్తపల్లి శ్రీనివాస్, జంగిడి సిద్ధులు, అఖిల్ మాల, గంధ మల్ల సమేశ్వర్, రసూల్ బండారి,రాయపురం కార్తీక్, దేవరకొండ రమేష్,పద్మ అజయ్, బొలుగుల లక్ష్మణ్,యాకం రెడ్డి, కర్రె నరేష్, సిరిపాటి రాజేష్, బొలుగుల తేజ, గంధ మల్ల స్టాలిన్, సాగర్, సందీప్, సంతోష్,ఉమాసాగర్,గర్నేపల్లి రాజు,నిఖిల్, కోండ్ర సందీప్, సిద్ధులు, భాస్కర్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.