
- జనగామ షాపుల్లో అధికారుల తనిఖీలు
జనగామ, మన చౌరాస్తా : ఆదివారం వచ్చిందా చాలు.. ఏ ఇంట్లో అయినా సరే చికెనో.. మటనో.. ఏదైనా కౌసు కూర కావాల్సిందే.. మరి మనం తినే చికెన్, మటన్ మంచిదేనా.. అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఇక వ్యాపారులు అమ్మే చికెన్, మటన్పై అధికారులు కూడా ఓ దృష్టి పెడితే మంచిదని అందరి భావన..
ఇటీవల జనగామ పట్టణంలోని ఓ హోటల్లో టిఫిన్లో బల్లి రావడం కలకలం రేపిన విషయం తెలిందే. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం జనగామ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, నెహ్రూ పార్క్, బస్టాండ్ రోడ్ లోని వివిధ మటన్ షాపులు, చికెన్ షాపులు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొందరు యజమానులు ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్సు దుకాణాలు నడిపిస్తున్నట్టు గుర్తించారు. వారిని వెంటనే లైసెన్స్లు తీసుకోవాలని హెచ్చరించారు. పలు మటన్, చికెన్ షాపులకు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలోని ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ కుమార్, వెటర్నటీ డాక్టర్ సాయి కిరణ్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పులి శేఖర్, సానిటరీ జవాన్ లక్ష్మణ్, తిరుమల తదితరులు పాల్గొన్నారు.