
- నన్ను రెచ్చగొట్టుద్దు..
- నా ఒంటిలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయి
- కొండ మురళి సంచన వ్యాఖ్యలు
మన చౌరాస్తా, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ అంటే సంచన రాజకీయాలకు కెరాఫ్ గా చెప్పవచ్చు. వీరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో తమకంటూ ఓ ప్రత్యేక ఎజెండాతో ముందుకు సాగుతుంటారు. సొంత పార్టీలోని నేతలను, అధిష్టానాన్ని సైతం లెక్క చేయకుండా సంచలన వ్యాఖ్యలు చేయడం వీరికి పరిపాటి. ప్రస్తుతం ఆధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరు ఇటీవల సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయం దూమారం రేపాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొండా బహిరంగంగా వ్యాఖ్యలు విమర్శలకు దారిసింది. అయితే ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ మంత్రి కొండా సురేఖ సైతం మాట్లాడాడం పార్టీలోని నేతలకు మింగుడు పడడం లేదు. ఒక సీనియర్ నేతగా ఉన్న కొండా తొటి లీడర్లపై విమర్శలు చేయడం, తన కూతురు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పార్టీ అంతర్గత కుమ్ములాటకు దారితీంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లోని నేతలు కొండా దంపతుల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పబట్టారు. వారంతా సమావేశమై కొండా దంపతులపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలపై పీసీసీ సైతం స్పందించింది. వారిని వివరణ ఇవ్వాలని కొండాకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షత జరిగిన సమావేశంలో కొండా మురళి హాజరై వివరణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్‌లోని జరుతున్న రాజకీయాలపై దాదాపు 15 పేజీల నివేదికను అందజేశారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘నన్ను రెచ్చగొట్టుద్దు.. నేను ఎవరికీ భయపడను.. చావును సైతం లెక్క చేయను.. నా ఒంట్లో ఇంకా నాలుగు బెట్లు ఉన్నాయి..’ అంటూ సంచలన కామెంట్లు చేశారు.