
- ఏం మాట్లాడుతున్నావమ్మా!
- టీచర్‌పై ప్రభుత్వ విప్ ఫైర్
- మధ్యాహ్న భోజనం సరిగా ఉండాలని ఆదేశాలు
యాదాద్రి, మన చౌరాస్తా : యాదగిరి గుట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం ఆస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం సమయంలో వెళ్లిన ఆయన పాఠశాలలో వండిన భోజనాన్ని చూసి ఒకింత అవాక్కైయారు. కూర బాగోలేదని విద్యార్థులు చెప్పడంతో వంట మనుషులు, మధ్యాహ్నభోజన ఇంచార్జి టీచర్‌ను పిలిచి వంటలపై ఆరా తీశారు.
‘ఎంటమ్మా ఈ కూర.. పిల్లలు బాగాలేదని చెబుతున్నారు కదా..’ అని ప్రశ్నించారు. సదరు టీచర్ వేలు చుపుతూ బీర్ల అయిలయ్యకు సమాధానం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన అయిలయ్య ‘ఏం మాట్లడుతున్నావ్.. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా.. పిల్లలకు మంచి భోజనం పెట్టాలి గానీ ఇదేందమ్మా..’ అని ఫైర్ అయ్యారు.
అనంతరం క్లాస్ రూమ్‌లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి టీచర్లు రెగ్యులర్ గా వస్తున్నారా? చదువు ఎలా చెపుతున్నారు.. అని అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుపగా సొంత నిధులతో వాటి మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. కాగా, దురుసుగా మాట్లాడిన టీచర్‌పై ఎమ్మెల్యే అయిలయ్య ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.