
- పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్
జనగామ, మన చౌరాస్తా : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, పాలకులు పట్టణాల అభివృద్ధికి కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదరశి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ కోరారు. సీపీఎం జనగామ పట్టణ కమిటీ సమావేశం అజారుద్దీన్ అధ్యక్షతన గిర్నిగడ్డ ఏరియాలో జరిగింది. ఈ సమావేశానికి అబ్బాస్‌తో పాటు పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పట్టణాల్లో ప్రజా సమస్యలు పేరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గం లేకపోవడంతో-మున్సిపల్ కార్యాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని అన్నారు. స్పెషల్ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడంతో పట్టణాలలో సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేయడం సరికాదన్నారు. పట్టణాలలో పారిశుద్ధ్య సమస్యలు, డ్రైనేజీ, వీధిలైట్లు, కోతులు, కుక్కలు, పందులు, దోమలు, దుమ్ము, ధూళి, వీధి దీపాలు వివిధ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ముఖ్యంగా ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు అన్ని రకాల కొత్త పెన్షన్లు రాకవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి పట్టణ ప్రగతికి తోడ్పడాలని అన్నారు. జనగామ పట్టణంలో కూడా పేరుకపోయిన ప్రజాసమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, నాయకులు బూడిద గోపి, బాల్నే వెంకటమల్లయ్య, కళ్యాణం లింగం, పల్లెర్ల లలిత, పాముకుంట్ల చందు, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.