
జనగామ, మన చౌరాస్తా : ప్రభుత్వ ఉద్యోగంలో పని చేసి మచ్చ లేని ఉద్యోగిగా పదవీ విరమణ చేయడం విశేషమని అలాంటి కోవకు చెందిన వారు జనగామ ఆర్టీసీ డిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ త్రి ముస్త్యాల ముత్తయ్య అని పలువురు వక్తలు కొనియాడారు. జూన్ 30 న పదవీ విరమణ చేసిన ముస్త్యాల ముత్తయ్య మరో నలుగురు ఉద్యోగుల అభినందన సభ డిపో ఆవరణలో మేనేజర్ స్వాతి అధ్యక్షతన జరుగగా మరుసటి మంగళవారం ముత్తయ్య జన్మస్థలం కోలుకొండలో గ్రామ ప్రముఖులు డా.పాము నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముత్తయ్యను సన్మానించారు. కోలుకొండ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు ముస్త్యాల మల్లమ్మ, సోమయ్య దంపతులకు జన్మించిన ముత్తయ్య కోలుకొండ జనగామలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1987 లో జనగామ డిపోలో కండక్టర్ గా ఉద్యోగ ప్రస్థానం మొదలై ఇదే డిపోలో టీ ఐ త్రిగా పదవీ విరమణ చేశారు. డిపో మేనేజర్ స్వాతి మాట్లాడుతూ ముత్తయ్యతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కండక్టర్ రామేశ్వరచారి, ఏడీసీ- టి.బి.ఎస్ రెడ్డి, ఎం.సి – మురళీకృష్ణ, డ్రైవర్ టి.వి.ఎన్. రెడ్డి ప్రతిభా పాటవాలను అభినందిస్తు ప్రసంగించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రవాణా శాఖ అధికారి జి.శ్రీనివాసు ఉద్యోగులను శాలువాలతో సత్కరించి అభినందించారు. బంధు మిత్రులు అనేక మంది పాల్గొని ఘనంగా సన్మానించారు. ముత్తయ్య కుమారుడు సంతోష్ రూపొందించిన పాటను కళాకారుడు గట్టగల్ల సంజీవ గానం చేశారు.