
జనగామ, మన చౌరాస్తా : ప్రముఖ ప్రభుత్వ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజుపై కేసు నమోదు అయ్యింది. తన కుమారులు బతికుండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించి ఆస్తి మార్పిడి చేసుకొని తనను సంరక్షించడం లేదని ఆయన తల్లి పగిడిపాటి ఎలిజబెత్ రెండు రోజుల కింద గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు బాధితురాలు డీసీపీ రాజమహేంద్ర నాయక్ ని కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ వైద్యడు పగిడిపాటి సుగుణాకర్ రాజు, ఆయన భార్య బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పగిడిపాటి సుధారాణి, ఆయన తమ్ముడు పగిడిపాటి భువన సుందర్ రాజు, పగిడిపాటి తేజశ్రీల పై పలు సెక్షన్లపై జనగామ పోలీసులు 296 (b), 318(4), 355, 315 (2), rw3(5), bns, 24 PAR షెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కావాలనే తన అన్న, ఆయన కొడుకులు అమ్మతో తనపై ఫిర్యాదు చేయించారని సుగుణాకర్ రాజు మీడియా కు తెలిపారు.