
జనగామ, మన చౌరాస్తా : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ మూడు రోజుల పాటు చేపట్టే ఆందోళనకు జనగామ నుంచి ఆ పార్టీ నేతలు తరలివెళ్లారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక ట్రైన్ లో రాష్ట్ర ముఖ్య నాయకులతో కలిసి బయలుదేరారు. వెళ్లిన వారిలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, NSUI ఉమ్మడి మాజీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, జిల్లా జనరల్ సెక్రటరీ అలేటి సిద్దిరాములు, నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీ నారాయణ, చేర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, నాయకులు తోట సత్యం, మంత్రి శ్రీశైలం, ఎదునూరి రవీందర్, జ్యోతి భాస్కర్, మాజీ సర్పంచ్ వేముల వెంకటేష్, తోట హేమలత, తాటికొండ సదానందం, కరుణాకర్ ఉన్నారు.