
హయత్నగర్, మన చౌరాస్తా : హైదరాబాద్లోని హయత్నగర్ ఏరియా మునగనూరులో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పుస్కరించుకుని వరలక్ష్మి వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయలను తెలిజేయాలనే లక్ష్యంతో గురుకులంలో ప్రతి పండుగను నిర్వహిస్తున్నట్టు టీచర్ల బృందం పేర్కొంది. టీచర్లు, విద్యార్థినులు తెలుగుదనం ఉట్టి పడేలా సాంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉప్పలంచి వర్షణి, తేజస్విని, శ్రీలక్ష్మి, అపూర్వ, భవిత, ఉజ్వల, సుష్మిత, మనస్విత అష్ట లక్ష్మి స్తోత్రం ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.