
- మూలన పడేసిన ‘మహనీయుల చిత్రపటాలు’
- నర్మెట తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
నర్మెట, మన చౌరాస్తా : గోడలపై గౌరవప్రదంగా ఉండాల్సిన మహనీయుల చిత్రపటాలు ఓ గదిలో మూలన పడేసిన తీరు అందరినీ కలిచివేసింది. నర్మెట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫీస్లో ఓ గదిలో పడి ఉన్న స్వాతంత్ర సమర యోధులు, మహనీయుల ఫొటోలను చూసి జనగామ విద్యా సామాజిక పౌర సేవా సంస్థ వ్యవస్థాపకుడు మొహమ్మద్ థఫ్జిల్ చూసి ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, తుప్పు పట్టిన పరికరాల పక్కన చింపబడ్డ కాగితాల మధ్య ఈ మహనీయుల చిత్రాలు ఉండటం చూసి మండి పడ్డారు. మన దేశం కోసం ఎన్నో తాగ్యాలు చేసిన వారిని ఇలా అవమానించడం బాధాకరం అన్నారు. ఫొటోలు ఇలా మూలన పడేయడం కేవలం నిర్లక్ష్యం కాదు, మన చరిత్రను, విలువలను మర్చిపోవడమే అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం దగ్గర్లో ఉన్న ఈ సమయంలో ఇలాంటి పరిస్థితి సమాజానికి తప్పు సందేశం ఇస్తుందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఈ చిత్రాలను గౌరవప్రదమైన స్థలంలో అమర్చాలి కోరారు.
