
- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
- జనగామ జీజీహెచ్లో వార్ ప్లాంట్ ప్రారంభం
జనగామ, మన చౌరాస్తా : జనగాం పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి వచ్చే రోజుగులు, వారి బంధువులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, బంధువులు, సిబ్బందికి పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో ప్రజల ఆరోగ్య భద్రత కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రిటైర్ కల్నాల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములు, రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, బచన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, డాక్టర్ రాజమౌళి, మాజీ ఎంపీపీ ధర్మ గోవర్ధన్ రెడ్డి, సర్వాల నర్సింగరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గనిపాక మహేందర్, సుధాకర్ రెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకటచారి, జనగామ జిల్లా ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్, డీసీసీ కార్యదర్శి చిర్ర హన్మంత రెడ్డి, జాయ మల్లేష్, వేముల మల్లేష్, మోర్తాల ప్రభాకర్, బండారి శ్రీను, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల సమ్మయ్య, జిల్లా సందీప్, వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎద్దు హరీష్, జినుకల రాజు, అఖిల్, రాజేష్, మోహన్ పాల్గొన్నారు.