
లింగాలఘణపురం, మన చౌరాస్తా : లింగాలఘణపురం మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మండలంలోని కల్లెంలో స్నేహ యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో గణపయ్యకు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. వేడుకల నిర్వహహకుగాను తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు, దళితరత్న మబ్బు పరశురామ్ మాదిగ రూ.10 వేల చందాను కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నవరాత్రి వేడుకలను ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని సూచించారు.