
- జనగామ డీసీపీ రాజ మహేంద్ర నాయక్
జనగామ, మన చౌరాస్తా : నవరాత్రి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జనగామ డీసీపీ రాజ మహేంద్ర నాయక్ సూచించారు. జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డలో గణేష్ నవరాత్రులు గత 45 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ మంటపలోని గణపతికి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న పిల్లలకు డీసీపీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీసీపీని గుండ్లగడ్డ మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ధర్మపురి శ్రీనివాస్, శ్రీకాంత్, వినయ్, పవన్, రాజు, బాల ఆదిత్య, శ్రీ ఆదిత్య విగ్నేష్ పటేల్, చారి తదితరులు డీసీపీకి వెంకటేశ్వర్ల స్వామి ఫొటోను జ్ఞాపకగా అందజేశారు.