
– సీసీఐ కేంద్రంలోనే మద్దతు ధర
– వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి అన్నారు. ఆదివారం ముల్కనూరులో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు శ్రమించి పంటను పండిస్తుంటే దళారులు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన చెందారు. సీసీఐ కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.