
* జనగామలో భారీ నిరసన
* ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు కదం తొక్కారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సాక్షి దినపత్రిక, టివి జర్నలిస్టులు కొత్తపల్లి కిరణ్, సురిగల భిక్షపతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రగామి ఎడిటర్ కన్న పరశురాములు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ఐజేయూ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పార్నంది వెంకటస్వామి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ఏపీ సర్కారు తన పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం హెచ్చరించారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు అశోక్, ఆనంద్, హింగే మాధవరావు, లక్షణరావు, వంగ శ్రీకాంత్ రెడ్డి, బండి శ్రీనివాస్, భాస్కర్, జితేందర్, ఉపేందర్, సంతోష్ కుమార్, యూసుప్, వినయ్, గోవర్ధనం వేణుగోపాల్, సుధాకర్, బాబా, జైపాల్ రెడ్డి, రమేష్, నవీన్ చారి, భాను, శ్రీను నాయక్, అశీష్, సుప్రిం, మణి, ఆఫ్రోస్ తదితరులు పాల్గొన్నారు.