
జనగామ, మన చౌరాస్తా : ఎంత ఎదిగిన తమ బాల్యంలో చదువుకున్న జ్ఞాపకాలను నెమర వేసుకోవాలని,
చదువు నేర్పిన విద్యాలయాన్ని గురువులని గుర్తుపెట్టుకోవాలని ప్రెస్టన్ స్కూల్ పూర్వ విద్యార్థులు.. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.
తాము చదువుకున్న స్కూల్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమం నిర్వహించి తమ గురుభక్తి చాటుకున్నారు. అనంతరం విద్యార్థులందరూ కలిసి తాము చదువుకున్న స్కూల్ ని సందర్శించారు.
బడిలో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందించారు. తాము చదువుకున్న బడికి
ఉపాధ్యాయులకు తమ వంతుగా ఏమైనా చేయాలని
ఉపాధ్యాయులతో పాఠశాలలో కావలసిన వసతులపై ఆరాతీసి వాటికి కావలసిన సహాయం తమవంతుగా అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కెమిస్ట్రీ భవన్ లో ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రోగ్రాంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొని సామూహిక భోజనం చేశారు.




