
- పోచన్నపేట ప్రాథమిక పాఠశాలలో ఘటన
బచ్చన్నపేట, మన చౌరాస్తా : పోచ్చన్నపేట ప్రాథమిక పాఠశాలలో పిల్లలు మధ్యాహ్న భోజనం ముగించాక సాంబారు పాత్రను కడుగుతుండగా సాంబారు పాత్ర అడుగున బల్లి కనిపించడంతో ఒక్కసారిగా పాఠశాల మొత్తం అలజడి రేగింది. ప్రధానోపాధ్యాయులు వెంటనే స్పందించి ఎంఈవోకు సమాచారం అందించగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న ఎంఈఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ స్పందించి వైద్యశాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ అధికారులు పాఠశాలకు పంపించారు. విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగగా, మధ్యాహ్న భోజనం నాణ్యతపై అధికారులు విచారణ ప్రారంభించారు. పిల్లల భద్రతే మొదటి ప్రాధాన్యం కావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.





