
- మొంథా తుపాను భారీ వర్షం
- ఉప్పొంగిన కాజ్ వే
- గమ్యం చేరలేకపోయిన విద్యార్థులు
- సురక్షిత ప్రాంతానికి తరలించిన ముల్కనూర్ పోలీసులు
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : మొంథా తుఫాన్ వల్ల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో 41.23 సెంటీమీటర్లతో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయింది. మండల వ్యాప్తంగా ఊహకందని పంట నష్టం జరిగిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. ముల్కనూరు మోడల్ స్కూల్ చెందిన 11 మంది విద్యార్థినులు మల్లారం, రసూల్పల్లి గ్రామాలకు వెళ్లాల్సి ఉండగా, ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మల్లారంలో లెవెల్ కాజ్ వే ఉప్పొంగింది. విద్యార్థుల తిరుగు ప్రయాణంలో కాజ్ వే దాటే క్రమంలో వరద ఉధృతి ఎక్కువైంది. దీంతో విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆటంకం కలిగింది. విషయం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్సై ఎన్.రాజు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులను తన వాహనంలో ముల్కనూరులోని మోడల్ స్కూల్ వసతి గృహానికి తరలించారు.




