
- రేవంత్ రెడ్డి పేరుపై ప్రత్యేక పూజలు
కొమురవెల్లి, మన చౌరాస్తా : కొమురవెల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపురం వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మేరుగు కృష్ణ, లింగంపల్లి శ్రీనివాస్, లింగంపల్లి కనకరాజు, కాయిత శ్రీనాథ్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, బత్తిని నర్సింహులు, సానాది భాస్కర్, ఏర్పుల కృష్ణ, జంగని రవి, శెట్టిపల్లి విజేందర్, పంజాల మల్లేశం, స్వాములపల్లి రమేష్, బుడిగి అశోక్, ఏర్పుల రాజు, వంగ ప్రసాద్ రెడ్డి, ఉప్పల వంశీ, యేనిశెట్టి కిరణ్, కొయ్యడ ప్రశాంత్, సాయికృష్ణ , మల్లం బాలయ్య, జనగామ శ్రీకాంత్, దొడ్ల విష్ణుమూర్తి, పబ్బోజు రాములు చారి, ఎక్కలదేవి శ్రీనివాస్, మేడికుంట శ్రీనివాస్, చింతల పర్షారాములు, దండు రమేష్, ఈగ కనకయ్య, బుడిగే ఐలేని, పొన్నం శేఖర్, చింతల రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన మన ప్రజా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, భగవంతుడు వారికి గట్టి బలం, సంకల్పం అందించి రాష్ట్రానికి మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.




