
బచ్చనపేట, మన చౌరాస్తా : రామచంద్రాపురం గ్రామములోని శ్రీ శివ సీతారామాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రతిష్టించేందుకు గురువారం పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని దాతలు విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన ఆముదాల యాకమ్మ, హనుమారెడ్డి దంపతుల కుమారులు ఆముదాల మల్లారెడ్డి, ఆముదాల భూపాల్ రెడ్డి, ఆముదాల ఇంద్రారెడ్డి సోదరులు రూ.65 వేలు విలువ చేసే కృష్ణ శిల రాయితో తయారు చేయించిన శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని బహూకరించారు. ఈ విగ్రహాన్ని ఆలయ ముఖద్వారం ముందున్న ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బక్కెర సిద్దయ్య, మారోజు సత్యనారాయణ, నాచగోని సిద్దేశ్వర, సుంకే కనకయ్య, కుడికాల రవి, పైసా నాగరాజు, నర్మట చంద్రమౌళి, ఆముదాల మోహన్ రెడ్డి, నాచగోని జయరాములు, నర్మెట రాములు, వేములవాడ నరేష్, సుంకరి రవి, ఆముదాల హరీష్ రెడ్డి, ఆముదాల అమరేందర్ రెడ్డి, ఆముదాల శ్రీనివాస్ రెడ్డి, ఆముదాల రితన్యా రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




