
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని, భారతరత్న, మహానేత అటల్ బీహారీ వాజ్‌పేయి 101వ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి ఆయనకు నివాళులు అర్పించారు. దేశ రాజకీయాల్లో వాజ్‌పేయి చేసిన సేవలను, ఆయన చూపిన నాయకత్వ దృక్పథాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదర్శప్రాయమైన నాయకత్వం, సమ్మిళిత భావజాలం, కరుణతో కూడిన దృఢత్వం, ప్రజాస్వామ్య సంయమనం ఇవన్నీ వాజ్‌పేయి గారి పాలనకు ప్రతీకలు. జాతీయతను ప్రజాస్వామ్య విలువలతో సమన్వయం చేసిన మహానేతగా ఆయన చిరస్మరణీయుడు. అందుకే ఆయన జయంతిని జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని పేర్కొన్నారు.అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం వాజ్‌పేయి గారి ‘వికసిత్ భారత్’ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో భీమదేవరపల్లి గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, చిదురాల రమేష్, గండు సారయ్య, జిల్లా నాయకులు దొంగల వేణు, రఘు నాయకుల ప్రదీప్ రెడ్డి, బొజ్జపురి పృథ్వీరాజ్, ములుగు సంపత్, కాలేరు వికాస్, బొల్లంపల్లి శ్యామ్, సింగం రాజేందర్, దొంగల రాణా ప్రతాప్, తాళ్లపల్లి కుమార్, మాడుగుల అజిత్, చొప్పరి నవీన్, మధుకర్‌తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




