
కొమురవెల్లి, మన చౌరాస్తా : కాటమయ్య రక్షణ కవచం వాడకం పై గురువారం చేర్యాల పట్టణం లోని ఎల్లమ్మ గుడి ఆవరణలో చేర్యాల, కొమురవెల్లి మండలాల పరిధిలోని వివిధ గ్రామాల కల్లు గీత కార్మికులకు KGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కాటమయ్య రక్షణ కవచం రాష్ట్ర కో ఆర్డినేటర్) బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి పంపిణీ చేస్తున్న కాటమయ్య రక్షణ కవచంను తీసుకున్న ప్రతి కల్లు గీత కార్మికుడు మోకులను విదిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. తాటి చెట్టు పై నుంచి జారినా కింద పడకుండా గీత కార్మికులకు ఎలాంటి ప్రాణ హాని ఉండదని కాబట్టి ప్రతి కల్లు గీత కార్మికుడు సేఫ్టీ కిట్లని వాడాలని కోరారు, ఈ శిక్షణ కార్యక్రమంలో ఆబ్కారీ SI సువర్ణ గారు, KGKS రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జనగామ జిల్లా కాటమయ్య రక్షణ కవచం కో ఆర్డినేటర్ బాల్నే వెంకట మల్లయ్య, సిద్దిపేట జిల్లా కాటమయ్య రక్షణ కవచం ( కోఆర్డినేటర్ )బండకింది అరుణ్, ట్రైనర్స్ కుర్ర ఉప్పలయ్య,బాల్నే కార్తీక్, అనగొని నర్సింలు, ఆకుల కనకయ్య, పోతుగంటి లింగం, వడ్లకొండ వెంకటేష్, అబ్కారీ శాఖ సిబ్బంది పరిదు, శ్రీకాంత్,
శ్రీ లత, సాయి సంపత్, పర్ష రాములు,kgks నాయకులు గుడాల గణేష్, నేరెళ్ళ నరేష్, గడ్డమీది ఐలయ్య, వడ్లకొండ సంజీవులు, మంతపూరి నర్సయ్య, కొయ్యడ బాలయ్య, గడ్డమీది నరేష్,రాజు, తదితరులు పాల్గొన్నారు.




