
కొమురవెల్లి, మన చౌరాస్తా : కొమురవెల్లి మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మత బోధకులు మాట్లాడుతూ ఏసుప్రభు చూపిన కరుణ, దయ మార్గము మానవాళికి ఆదర్శమన్నారు. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరి యాలని, ప్రతి ఒక్కరు తోటి వారికి సహాయము చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తమ మతాన్ని ఆరాధిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని తెలిపారు.




