
కొమురవెల్లి, మన చౌరాస్తా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మహారాజ పోషకులుగా తమ వంతు ఆర్థిక సహాయంగా రచ్చ అనిత భాస్కర్, సిద్దిపేట వాస్తవ్యులు రూ. 1,00,116 అందజేశారు. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి దేవాలయం తరఫున స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని, వేద ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్న కులదైవమని, కచ్చితంగా కోరికలు నెరవేరుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు చంద్రశేఖర్, ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్ అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




