
- ప్రజలు స్పందించ వద్దన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా
- సైబర్ నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు
జనగామ, మన చౌరాస్తా : సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. ఏకంగా జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రొఫైల్ తో ఫేక్ వాట్సప్, ఫేస్ బుక్ పేజీ క్రీయేట్ చేసి ప్రజలకు మెస్సేజ్‌లు పెడుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. తన ప్రొఫైల్‌తో వాట్సాప్, ఏ ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే మెస్సేజ్‌లకు ప్రజలు, అధికారులు స్పందించవద్దని కలెక్టర్ కోరారు. ఆకతాయిలు చేసే ఇలాంటి సైబర్ మోసాలతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.





