
జనగామ, మన చౌరాస్తా : పెద్ది నవీన్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తమ్ముడు పాముకుంట్ల మణిదీప్ గౌడ్ మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు తుంగ కౌశిక్ మాట్లాడుతూ జనగామ జిల్లా కేంద్రంలో పెద్ది నవీన్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా అనాథలు, ప్రయాణికులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. పుట్టిన రోజు సందర్భంగా సేవ చేయడం మంచి పరిణామం అని, ప్రతీ ఒక్కరూ పుట్టిన రోజు సందర్భంగా పది మందికి సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో గంధమల్ల కమలాకర్, వెమ్మల్ల అభిలాష్ రెడ్డి, గుగ్గిళ్ల శ్రీధర్, గాయకోటి రమేష్, సామ అనిల్, మేము సైతం ఫౌండేషన్ సభ్యులు నీలం శ్రీకాంత్, అనిల్, తుడి దేవరాజ్, చింతల మనితేజ తదితరులు పాల్గొన్నారు.





