
జనగామ, మన చౌరాస్తా : జనగామ అమ్మ ఫౌండేషన్ టీమ్ సభ్యుడు కొయ్యడ నాని పుట్టిన రోజు సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ రైల్వే స్టేషన్ వద్ద యాచకులు, పేద ప్రజలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి కుమార్, ముఖ్య సలహా దారులు వంగ భీమ్ రాజ్ మాట్లాడుతూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొయ్యడ నానికి అమ్మ ఫౌండేషన్ తరుఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ నిరంతరం సేవ చేస్తున్న అమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కోయాడ రవి కుమారుడు కోయాడ నాని ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మద్దెల కార్తీక్, బింగి నరసింహులు, వెంపటి అజయ్, మహమ్మద్ అఫ్రోజ్, పల్లె హరీష్, మహమ్మద్ యాకుబ్, చిన్న పాల్గొన్నారు.
ఎంసీహెచ్ వద్ద..
అలాగే పట్టణానికి చెందిన మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ మాత శిశు ఆసుపత్రి వద్ద వైద్యం కోసం వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మోక్షజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.





