
హైదరాబాద్, మన చౌరాస్తా : తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 2025 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ఉత్తమ వార్త చిత్రానికి జనగామ సాక్షి ఫొటో జర్నలిస్టు గోవర్ధనం వేణుగోపాల్ కన్సోలేషన్ బహుమతి లభిచింది. హైదరాబాద్లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ నేతలు దేవరపల్లి అమర్, విరాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.




