
- హైదరాబాద్ లో ప్రారంభమైన ఎన్ యుజేఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మన చౌరాస్తా : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం నగరంలోని చిక్కడపల్లిలో హోటల్ శ్రీ వేద ప్రీమియంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ (టీఎస్ జెయు) ఆధ్వర్యంలో నేషనల్ జర్నలిస్టు యూనియన్ ఆఫ్ (ఇండియా) జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట స్వామి మాట్లాడుతూ జర్నలిస్టులకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలుసునని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టులు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, ఎన్ యుజె(ఐ) జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ జాతీయ ప్రధాన కార్యదర్శి త్రియగ్ నారాయణ, టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం నారగౌని, తోకల అనిల్ కుమార్, స్కూల్ ఆఫ్ జర్నలిజం చైర్మన్ నాగేశ్వరరావు, ఎన్ యుజె(ఐ) కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాజు పటేల్, అరుణ్ కుమార్, పావుశెట్టి శ్రీనివాస్, కందికొండ మోహన్, చిర్రగోని ఉదయ్ దీర్, ఉప్పలంచి నరేందర్, పోచంపల్లి రజిత, నాగరాజు, శ్రీనాథ్, అవునురి సంపత్, గట్టు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






