
హైదరాబాద్, మన చౌరాస్తా : హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్ వద్ద అవంతిక కన్స్ట్రక్షన్స్ & తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు 2K, 5K, 10K రన్స్‌తో పాటు 21K హాఫ్ మారథాన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రన్నర్స్ పాల్గొన్నారు. జనగామ జిల్లా నుండి అడ్వకేట్ పానుగంటి శ్రీనివాస్ (లాయర్) గారి అధ్యక్షతన రన్నర్స్ బృందం ఈ మారథాన్‌లో అన్ని విభాగాలలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. జనగామ జిల్లా రన్నర్స్ సభ్యులు ఆరోగ్యం, ఫిట్నెస్ మరియు క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహిస్తూ పూర్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమంలో జనగామ జిల్లా నుండి అడ్వకేట్ పానుగంటి శ్రీనివాస్ (లాయర్), మరాఠీ శ్రీశైలం, దోర్నం కుమారస్వామి, కొండ శ్రీనివాస్, పెరుమల్లి ఉమేష్, కాలూరి మల్లికార్జున చారి, కసాబు రమేష్, బూరెల రామకృష్ణ, కీర్తి వీరేందర్ (కరస్పాండెంట్ – S.P.R స్కూల్), కానిస్టేబుల్స్ శాడ పోచయ్య, కోల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మారథాన్ ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు యువతలో ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెరగాలని నిర్వాహకులు తెలిపారు.




