suma deepa
వంటలక్క, సుమక్క.. సందడే సందడి
వంటలక్క, సుమక్క.. ఈ ఇద్దరు దసరాకు తెలుగువారి నట్టిట్లో సందడి చేయనున్నారు. కేరళా కుట్టి ప్రేమి విశ్వనాథ్ అలియాస్ ‘వంటలక్క’ అలియాస్ ‘దీప’.. కార్తీక దీపం సీరియల్‌తో ప్రేమి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నవిషయం తెలిసిందే. ఇక యాంకర్ సుమ (సుమక్క) గురించి చెప్పనక్కర్లేదు. ఈ దసరాకు వీరిద్దరిని (suma deepa ) ఒకే వేదికపై చూడనున్నాం. తెలుగు బుల్లితెరపై ఎంతో ఆధరణ పొందిన దీపను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేసిన వారు లేరు. తొలిసారిగా సుమ ఓ టీవీలో ఆమెతో మాటాముచ్చట చేయనుంది. అంతే కాదు వంటలక్క ఈ మాటముచ్చతో పాటు మరో చానెల్ తన నటి విశ్వరూపాన్నిచూపించేందుకు రెడీ అయ్యింది. మహిషాసుర మర్దిని గెటప్‌లో విడుదల చేసిన ఆ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతీ ఒక్కరూ ఆ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ దసరాకు వంటలక్క తన డబుల్ ధమాకాతో తెలుగువారి ఇంట్లో సందడి చేయనుంది.
ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో ఇప్పడు వైరల్‌గా మారాయి.