Chiru , Mahesh : వానలతో ఆగమైన హైదరాబాద్‌ను ఆదుకునేందుకు తెలుగు స్టార్స్ ముందుకొస్తున్నారు. మొదటగా బాలయ్య రూ.1.50 కోట్ల సాయం అందంచగా, ఆయన ఆ తర్వాత ఒక్కొక్కరు సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌బాబు (Chiru, Mahesh) రూ.1కోటి చొప్పున ఇవ్వగా, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్కరు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విజయ్ దేవిరకొండ రూ.10 లక్షలు, దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ రూ.5 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు.