Nagababu : ప్రముఖ నటుడు నాగబాబు, ఆయన సతీమణి పద్మజ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత తాను ఎదుర్కొన్నఇబ్బందులను ఆయన ఇటీవల విరించారు. ‘ఎవరికైనా సరే చిన్నలక్షణాలు కనిపించినా వెంటనే టెస్టు చేయించుకోవాలి. నాకు ఆస్తమా ఉండడంతో కరోనాతో కాస్త ఇబ్బంది పడాల్సివచ్చింది. ఆస్పత్రిలో చేరిన మొదట్లో ఊపిరాడక అవస్థ పడ్డాను. మూడు రోజుల తర్వాత వాసన పూర్తిగా పోయింది. డాక్టర్ల సలహాలు పాటిస్తూ మందులు సక్రమంగా వాడాను. బాగయ్యను.. ఇంటికి వచ్చాక మరో వారం పాటు హోం ఐసోలేషన్లో ఉన్నాను. నేను ఇంటికి వచ్చే సమయానికి నా భర్య పద్మజకి కోవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. ఆమె నా కంటే ఆరోగ్యవంతురాలు అందుకే వెంటనే కొలుకుంది.. మొత్తానికి నేను సాధారణ జీవితంలోకి రావడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది..’ అని నాగబాబు (Nagababu) చెప్పుకొచ్చారు.