
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : ఎస్సీ వర్గీకరణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని కోరుతూ మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ లో ఈ నెల 7న తలపెట్టిన ‘వేల గొంతులు.. లక్ష డప్పుల దండోరా..’ సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమం దిగ్విజయం చేయాలి అని కోరుతూ శనివారం జనగామలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా పట్టణంలోని నెహ్రూపార్కు నుంచి ఎమ్మార్పీఎస్ జెండాలు, బ్యానర్ పట్టుకొని ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్ఎంఆర్ గార్డెన్లో నిర్వహించిన సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్ మాదిగ అధ్యక్షత వహించగా మంద కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
7న మాదిగలు డప్పు వేసుకుని, మాదిగ ఉప కులాల వారు వారి సంప్రదాయ వస్తువులు పట్టుకుని హైదరాబాద్ రావాలని పిలుపునిచ్చారు. మాదిగలకు చెప్పులు కుట్టే కుల వృత్తి ఉన్నది దాని గురించి సిగ్గు పడకుండా ఉండాలన్నారు. అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయిన తన ములన్ని మర్చిపోలేదన్నారు. రాముడు కాలంలో కుర్చీ మీద చెప్పులు కూర్చున్నాయి మర్చి పోవద్దని గుర్తుచేశారు. మా డప్పు ప్రతి గ్రామంలో మొదటి విలేకరి అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధిస్తే రాబోవు తరాలకు భవిష్యత్తు బాగుంటున్నారు.
‘నాకు మద్దతు ఇస్తాం అంటే అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చానని, అదే మాట తప్పితే వారిపై యుద్ధం చేశా..’ అని గుర్తుచేశారు. ‘నా లక్ష్యం గొప్పది అని నేను నా కండువా మారలేదు.. మార్చితే నేను అనేక పదవులు అనుభవించే వాడిని.. ఆర్.కిష్టయ్య బీసీ ఉద్యమాన్ని పక్కకు జరిగి 4 పార్టీలు మారాడని..’ అన్నారు. వర్గీకరణ సాధించే వరకు ఉద్యమం ఆగదని ఆయన చెప్పారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతికి సూర్యుడు మన కృష్ణాన్న అని కొనియాడారు. దేశంలో అతి పేద వారు మాదిగ కులస్తులని, ఏ మతం, కులంలో పుట్టిన ఏ ప్రజల కోసం పనిచేస్తున్నామో ముఖ్యం అన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని తెలిపారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, డాక్టర్ సుగుణకర్, డాక్టర్రాజమౌళి, డాక్టర్ కృష్ణ, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశంలో ధర్మకంచకు చెందిన ఉద్యమకారుడు, రచయితన మెంట నర్సింగరావును మంద కృష్ణ సన్మానించారు.