
జనగామ, మన చౌరాస్తా : తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ జనగామ ఏసిపి కార్యాలయం ఎదుట బచ్చన్నపేట మండలం దబ్బకుంటపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. గత రెండు నెలల క్రితం గ్రామంలో జరిగిన దంపతుల మృతి కేసులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.తన భర్తను పోలీసులు తీసుకెళ్లి ఐదు రోజులు గడుస్తున్నా చూపించడం లేదని భార్య హారిక,కుటుంబ సభ్యుల ఆవేదన చేస్తూ తన భర్తను తమకు చూపించాలంటూ ఏసీపీ కార్యాలయం ఎదుట శ్రీకాంత్ రెడ్డి భార్య,కుటుంబ సభ్యుల బైఠాయించి ధర్నా చేశారు.సంబంధం లేని కేసులో శ్రీకాంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని,చేయని తప్పుకు నేరం అంగీకరించాలని పోలీసులు బలవంతం చేస్తున్నారని కుటుంబ సభ్యుల ఆరోపించారు.ఐదు రోజుల గడుస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఎక్కడున్నాడో,ఏమయ్యాడో పోలీసులు చెప్పడం లేదని తన భర్తను చూపించాలని డిమాండ్ చేశారు.




