
agriculture farming in tealanga : సాగు బాటలో..
ఆయన ఓ సీనియర్ డెస్క్ జర్నలిస్ట్.. ఏసీ రూమ్‌లో కంప్యూటర్‌పై కూర్చుని పదాలతో కుస్తీ పట్టేటోడు.. ఆకట్టుకునే హెడ్డింగ్‌లు, ఇంట్రోలతో అదరగొట్టేటోడు.. ఆసక్తికర కథనాలకు జీవం పోసేటోడు.. ఏమైందో ఏమో.. నీడ పట్టున ఉండి చల్లగా పనిచేసుకునే ఉద్యోగాన్ని వదిలి ‘సాగు బాట’ పట్టాడు. అందులోనూ అద్భుతాలు సృష్టిస్తూ.. విజయాలు సాధిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నాడు. అసలు ఆయన కలం వీడి.. హలం పట్టడానికి గల కారణాలేమిటి..? ఎంచుకున్న దారిలో తను పడిన కష్టాలేమిటి..? అప్పట్లో అగ్రికల్చర్ జర్నలిస్ట్‌గా (agriculture) అవార్డు అందుకుని.. ఇప్పుడు మట్టి మనిషిగా ‘సాగు’తున్న ఆయన అనుభవాలు త్వరలో మీ ముందుకు..