Allu Arjun : ఫాదర్ అయ్యాక.. బూతులు తగ్గించా..
ఫాదర్ అయ్యాక.. మీలో ఏమైనా మార్పులు వచ్చాయా అంటే.. టక్కున ‘ఇంట్లో కొంచెం బూతులు తగ్గించా..’ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు సామ్ జామ్ సమంతాతో.. ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ న్యూఇయర్ స్పెషల్ ఎపిసోడ్‌కు ఆయన గెస్ట్ గా వచ్చి ఫ్యాన్స్ ను అలరించారు. మరి ఆ స్టైలిష్ స్టార్ ముచ్చట్లు మీ కోసం..
‘స్టైల్ అనేది మనం వేసుకునే బట్టల్లో ఉండేది కాదు.. నా వరకైతే అది మైండ్‌కు సంబంధించిన విషయం. మనకు మనీ ఉన్నా.. లేకున్నా.. మైండ్ సెట్లో స్టైల్ ఉంటే అది ఆటోమెటిక్‌గా బయటకు కనిపిస్తుంది.’
2020 మర్చిపోను..
అందరికీ 2020 సంవత్సరాన్ని మర్చిపోవాలని ఉంటుంది. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ ఆ ఏడాదిలో బాధపడ్డారు. నాకు మాత్రం 2020 బాగా కలిసొచ్చింది. నేను ఎప్పటికీ మరువలేను. 2020 ప్రారంభంలోనే ‘అలా.. వైకుంటపురంలో..’ వంటి ఆల్ టైం రికార్డు మూవీ వచ్చింది. తర్వాత ‘ఆహా’ యాప్ లాంచ్.. ఆ తర్వాత ‘అల్లు స్టూడియో..’ ఫౌండేషన్ వేశాం.. ఎప్పటి నుంచో నాకు స్టూడియో మీద ఆశ ఉండేది.. అది ఈసారి తీరింది. అందుకే 2020ని నేను మర్చిపోను.
‘రక్షసుడు’ జాకెట్ కోసం ఆరా..
అలా వైకుంటపురంలో.. సినిమా అనుకున్నదానికంటే ఎక్కువే సక్సెస్ ఇచ్చింది. అందులోని ‘బుట్టబొమ్మ’ పాట డ్రెస్, ఆఫీస్ సీన్లో వేసుకున్న రెడ్ జాకెట్‌ను నేను దాచి పెట్టుకున్నా.. (Allu Arjun) అవి మనకు ఇప్పడు మామూలుగా అని పిస్తాయి. కానీ 10 ఏళ్ల తర్వాత వాటి వ్యాల్యూ తెలుస్తుంది. ఓ సారి చిరంజీవి గారి ‘రక్షసుడు’ సినిమా చూస్తూ ఆయన అందులో వేసుకున్న జాకెట్ చూసి దాని గురించి ఆరా తీశాను. కానీ, అది దొరలేదు. ఆ తర్వాత అనిపించింది. మనం మూవీలో వేసుకునే కాస్ట్యూమ్ ఓ మంచి మెమరీ అని. అప్పటి నుంచే దాచి పెట్టుకోవడం అలవాటు చేసుకున్నా.
ఆ క్వాలిటీలే నన్ను పడేశాయి..
నా భార్య స్నేహాలో నాకు నచ్చిన క్వాలిటీలు రెండు ఉన్నాయి. ఒకటి డిగ్నిటీ, రెండు బ్యాన్స్.. అవే నన్ను పడేశాయి. ఇక ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు అయాన్ (కొడుకు), అర్హా (కూతురు)తో నాది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ మాత్రమే. మిగతా విషయాలన్ని తనే చూసుకుంటుంది.
ఐయామ్ వేరీ హ్యాపీనే..
‘మీ కూతురు ఆర్హా.. నాన్న నేను హీరోయిన్ అవుతానంటే.. మీ ఫీలింగ్’ అన్న ప్రశ్నకు బన్నీ ‘ఐయామ్ హ్యాపీ.. తప్పంటి.. అమ్మాయిలు సినిమాల్లోకి రావద్దా.. రావాలి.. వాళ్లేంటో నిరూపించుకోవాలి. మా తాతగారు, నాన్న, నేను.. నా తర్వాత నా కూతురు అంతే.. అందులో ఏముంది. మనం పెరుగుతున్న క్రమంలోనే మన చుట్టూ ఉన్న ఎనర్జీ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. అలా నాన్నకు, నాకు సినిమా అనే ఎనర్జీ వచ్చేసింది. అది నా పిల్లలకూ రావచ్చు. వస్తే నేనూ సంతోషిస్తా.. ’ అంటూ చెప్పుకొచ్చారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)