జనగామ, మన చౌరాస్తా : జనగామలోని బతుకమ్మ కుంటలో కళా, సాహిత్య, ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణ కోసం ఒపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించాలని కవులు, కళాకారులు కోరారు. ఈ మేరకు ఐక్యవేదిక అధ్వర్యంలో సోమవారం జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. జనగామ జిల్లా అనేక రకాల కళలకు సాహిత్యానికి ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ కళావేదిక నిర్మాణం ఎంతో అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కళా, సాహిత్య రంగాలను ప్రోత్సాహించాలని వినతిపత్రంలో కోరారు. బతుకమ్మ కుంటలో కళా వేదిక నిర్మాణం కోసం 25 కళా, సాహిత్య సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించి నట్లు కవులు, కళాకారులు తెలిపారు. వినతిపత్రం సమర్పించినవారిలో కవులు కళాకారులు ఐక్యవేదిక నాయకులు జి.కృష్ణ, అయిలా సొమనర్సింహచారి, లగిశెట్టి ప్రభాకర్, మాన్యపు భుజేందర్, చీటూరు నర్సింహులు, ఆనంద్ కుమార్, కన్నారపు శివశంకర్, చిలుమోజు సాయికిరణ్, గుగ్గిల్ల నర్సయ్య, చిలుమోజు దక్షిణామూర్తి, పెట్లోజు సోమేశ్వరాచారి, డాక్టర్ వేముల సదానందం, పొట్టబత్తిని భాస్కర్, గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.