జనగామ, మన చౌరాస్తా : పట్టణానికి చెందిన బొక్కల బాలస్వామి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య బొక్కలు అన్నపూర్ణ, కూతుర్లు, కొడుకు ప్రసన్న, పావని, ప్రణయ్ కుమార్ జనగామలోని రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ జనగామ అమ్మ ఫౌండేషన్ ఆలోచన ఆశయంలో బొక్కల బాలస్వామి కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరాలుగా పాలుపంచుకుంటున్నారన్నారు. సందర్భం ఉన్నప్పుడల్లా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు, యువత, ప్రతి ఒక్కరూ సందర్భం ఏదైనా కానీ సమాజంలో జీవిస్తున్న నిరాశ్రయులు, అనాథలు, వృద్ధులకు అండగా నిలవాలని, అంతరించిపోతున్న మానవత్వాన్ని బతికించాలని కోరారు. కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు కొయ్యాడ రవి, పండుగ నరేష్, బింగి నరసింహులు, ఎర్రవెళ్లిబాబు తదితరులు పాల్గొన్నారు.