
జనగామ, మన చౌరాస్తా : బీజేపీ నేత ఆరుట్ల దశమంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 మందిని స్పోక్స్ పర్సన్స్ గా నియమించగా.. అందులో జనగామ నుంచి దశమంత్ రెడ్డికి అవకాశం దక్కింది. దశమంత్ రెడ్డి గతంలో జనగామ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.




