
కొమురవెల్లి, మన చౌరాస్తా : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు సంఘటితం కావాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వైశ్య సత్రంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణికుంట గణేష్ గుప్తా, యువజన విభాగం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల్ల రామ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అగిర్ వెంకటేష్, రాజకీయ కమిటీ చైర్మన్ చింతల రవి కుమార్ తో కలిసి జిల్లాలోని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మర్చి 04న జరిగే ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలలో జిల్లాకు చెందిన 31 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తనకు ఓటు వేసి గెలించాలని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల ఐక్యతకు, అభివృద్ధికి, రాజకియంగా ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దానని, ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వం స్థలం కేటాయించేందు తను కృషి చేశానని, దాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలంగాణలోని ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం పెంచానని, తాను గెలిచాక మరింత మంది సభ్యుల సభ్యత్వం సేకరించి పటిష్ట పరుస్తానని అన్నారు. అనంతరం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయిత రత్నకర్, జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్, జిల్లా వ్యవస్థపాక కన్వీనర్ మంచాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హారినాథ్,జిల్లా కోశాధికారి మంకాల నవీన్ కుమార్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గంప కృష్ణ మూర్తి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మంకాల నాగరాణి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తడక లింగ మూర్తి, జిల్లా యూత్ అధ్యక్షులు మంకాల నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు మాంకాల శంకర్ లింగం, మండల అధ్యక్షులు ఉప్పల చంద్రశేఖర్ పాల్గొన్నారు.