- పార్టీ పరువు తీయకండి
- మాజీ మున్సిపల్ చైర్మన్కు కాంగ్రెస్ లీడర్లకు హితవు
జనగామ, మన చౌరాస్తా : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేసి సొంత వారికి అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్ని షోకాస్ నోటీసులు జారీచేసినా, వారిలో మార్పు రాకపోగా సొంత వాహనాలనే దగ్ధం చేసుకునే దురదృష్ట స్థాయికి దిగజారారని పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, జనగామ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డితో పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాళా కళ్యాణి, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎర్రమల్ల సుధాకార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయనలో మార్పు రాలేదన్నారు. సొంత వాహనాలనే దగ్ధం చేసుకునే దురదృష్ట స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సుధాకర్ తనకు తానే వర్గాలుగా అభివర్ణించుకుంటూ ఎమ్మెల్యే స్థాయి నాయకులమని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇవి ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వాహనాన్ని దహనం చేసిన వ్యక్తుల పైన అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కార్యకర్తల్లో ఐక్యత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే కార్యకలాపాలు మానుకోవాలని, లేకుంటే త్వరలోనే అధిష్ఠానం సరైన గుణపాఠం చెబుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.కార్యక్రమంలో మేడ శ్రీనివాస్, సర్వల నరసింగరావు, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బనుక శివరాజ్, బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, నర్మెట మండల అధ్యక్షుడు రాజుపేట లక్ష్మీనారాయణ, తరిగొప్పుల మండల అధ్యక్షుడు యాదగిరి గౌడ్, బొట్ల నరసింగారావు, జాఫర్ షరీఫ్, ఎంపీటీసీ మెరుగు బాల రాజ్ గౌడ్, మాసాపేట రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గాజే అనిల్, గొలుసుల దుర్గేష్, మచ్చ ప్రవీణ్ రఘు, అల్వాల రమేష్, అండాలు, మిద్దపాక సిద్దులు, కృష్ణారెడ్డి, సందేల రాము పాల్గొన్నారు.