
బచ్చన్నపేట, మన చౌరస్తా: బచన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఏర్పాట్ల గురించి మండల్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. బచ్చన్నపేట వైద్యాధికారి డాక్టర్ సృజన మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ నెల 10న మధ్యాహ్నం భోజనం తరువాత 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరం పిల్లలకు సగం మాత్ర ఆల్బెండజోల్ 200 ఎంజి చూర్ణం చేసి చెంచాలో నీరు కలిపి త్రాగి నించవలేనని, 3 నుంచి 19 సంవత్సరాల పిల్లలు అందరికి ఒక మాత్ర ఆల్బెండజోల్ 400 ఎంజి, 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు పౌడర్ చేసి, నీటిని కలిపిన మిశ్రమాన్ని త్రాగించవలెనని,10 తేదీన హాజరు కానీ పిల్లలు 17 వ తేదీన మోప్ అప్ డే రోజ మాత్రలు వేసుకోవలసిందిగా చెప్పారు. వ్యక్తిగత శుభ్రత, హాండ్ వాషింగ్, గురించీ తెలియజేశారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎన్.టి ప్రకాష్ రావు మాట్లాడుతూ మంచి కార్య క్రమం అందరూ మండల కేంద్రం లోని పిల్లలు అందరూ తప్పక మాత్రలు వేసుకోవాలని సూచించారు. మండల విద్యాదికారి ఇర్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తమ పూర్తి సహకారం ఉంటుందని, మండలంలోని పాఠశాల ఉపాధ్యాయులకు ఎన్డీడీ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచనలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీఎస్సీ డాక్టర్లు, సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది, ఎన్ఎంలులు, అంగన్ వాడ వర్కర్స్ పాల్గొన్నారు.