Balakrishna : బాలయ్యకు షాక్
బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్నసినిమా చిత్రీకరణను వికారాబాద్ జిల్లా వాసులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా పంట పొలాల్లో ఎలా చిత్రీకరణ చేపడుతారని ప్రశ్నిస్తూ చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. తాజాగా మూడో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. గతంలో నిర్మించిన రెండు సూపర్ హిట్ సాధించడంతో మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ద్వారక క్రియేషన్స్ వారి ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్‌ను వికారాబాద్ జిల్లాలోని కోటాలగూడలో చిత్రీకరిస్తున్నారు. కాగా, వ్యవసాయ భూముల్లో షూటింగ్ చేయడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామపంచాయతీ పర్మిషన్ తీసుకోకుండా షూటింగ్ నిర్వహించడంపై అగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చిన తర్వాతనే షూటింగ్ చేసుకోవాలని చిత్ర యూనిట్‌కు స్పష్టం చేశారు. దీంతో సినిమా చిత్రీకరణ ఆగిపోయింది.
మైనర్ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు