beggars update : యాచకులు అప్ డేట్
‘బిచ్చగాళ్లు.. మరింత అప్ డేట్’.. బిచ్చగాళ్లు ఏంటీ.. అప్ డేట్ అవ్వడం ఏంటీ.. అని ఆశ్చర్యపోకండి. మారుతున్న కాలనికి అనుగుణంగా యాచకులు కూడా కొత్త తరహాలో భిక్షం ఎత్తడం మొదలుపెట్టారు. కావాలంటే.. చూడండి.. మానుకోట జిల్లా కేంద్రంలో చెంచుల తెగకు చెందిన ఓ యాచకుడు (beggars update ) నిత్యం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు.. ఎవరినైనా ‘అయ్యా.. బాంఛన్..’ అన్నప్పుడు.. ‘జేబులో డబ్బులు లేవు’ అని వారు బదులిస్తే.. చాలు.. టక్కున ‘ఫోన్ పే అయినా చేయండి బాబూ..’ అంటూ క్యూర్ కోడ్ చూపిస్తూ విన్నూతంగా యాచిస్తున్నాడు. అతడి ఐడియా చూసి ఆశ్చర్యానికి గురవుతూనే.. ముసిముసి నవ్వులు నవ్వుతూ.. కొందరు క్యూర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్ దానం చేస్తున్నారు. నోట్ల రద్దు, యూపీఐ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రతీ ఒక్కరు ఏది కొనాలన్నా ఆన్లైన్ పేమెంట్స్ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన, ధర్మాలు ఏవైనా సరే ఆన్లైన్లోనే చేయాల్సిన పరిస్థితులు రాక తప్పదని తెలుస్తోంది. గతంలో కూడా ఓ వృద్ధుడు స్వైప్ మిషన్తో అడుక్కునే వీడియో వైరల్ అయ్యింది.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..